వరదల్లో చిక్కుకున్న 350 మంది డిగ్రీ విద్యార్థులు !

by velandi.Saikiran |

రామాయంపేట మండల కేంద్రంలో గల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్ లో సుమారు 350 మంది విద్యార్థులు వరద నీటిలో

వరదల్లో చిక్కుకున్న 350 మంది డిగ్రీ విద్యార్థులు  !
X

దిశ, నిజాంపేట: జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణ గ్రామీణ, ప్రాంతలు జలమయమయిపోయాయి. ఈ తరుణంలో రామాయంపేట మండల కేంద్రంలో గల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్ లో సుమారు 350 మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుకుపోయారు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి హాస్టల్ భవనం చుట్టూ వరద నీరు చేరింది. దీంతో విద్యార్థులు బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మధ్యాహ్న భోజనం లేకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నట్లు సమాచారం. విద్యార్థులను బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Next Story