- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాధువు ముసుగులో గంజాయి సాగు
గుడిలో పూజారి.. ఆలయ భూముల్లో గంజాయి సాగు సంగారెడ్డి జిల్లా పంచగామ గ్రామంతో పాటు చుట్టు పక్కల పది గ్రామాల ప్రజలకు గురువు అవుటి నాగయ్య మహారాజ్‌గా చెలామణి.

దిశ, నారాయణఖేడ్ : గుడిలో పూజారి.. ఆలయ భూముల్లో గంజాయి సాగు సంగారెడ్డి జిల్లా పంచగామ గ్రామంతో పాటు చుట్టు పక్కల పది గ్రామాల ప్రజలకు గురువు అవుటి నాగయ్య మహారాజ్‌గా చెలామణి. గుడికి వచ్చె భక్తులకు నాలుగు మంచి మాటలు చెప్పడం, భక్తి భావాన్ని నేర్పించాల్సిన గూరూజీ గంజాయి సాగు, అమ్మకాలు చేస్తూ డీటీఎఫ్ ఎక్సైజ్ సిబ్బందికి పట్టు బడిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచాగామ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. ఈ గ్రామంలో పంట చేన్లలోను, పత్తి చేన్లలో గంజాయి సాగు చేసే పరిపాటి. . ఈ గ్రామంలో గంజాయి సాగు చేస్తూ ఉండడంతో ఎక్సైజ్ సిబ్బంది తనీఖీలు నిర్వహించడానికి వెళితే దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి. గ్రామం కావడం కొస మెరుపు. పంచాగామ గ్రామంలో గంజాయి సాగు జరుగుతుందనే సమాచారం మేరకు డీటీఎఫ్ సీఐ దుబ్బాక శంకర్, ఎస్సైలు హన్మంత్, అనుదీప్‌లతో పాటు అంజిరెడ్డి, అరుణ జోతి, శివకృష్ణ , రాజేష్‌లు కలిసి దేవాలయం ప్రాంగణంలో బంతిపూల తోటలో గంజాయి మొక్కలను సాగు చేశాడు. చాలా కాలంగా గంజాయి సాగు చేస్తూ ప్యాకెట్లుగా తయారు చేసి అమ్మకాలు సాగుచేస్తారనే సమాచారం విచారణలో వెల్లడయ్యింది.
పంచాగామ గ్రామంలో శుక్రవారం డీటీఎఫ్ ఎక్సైజ్ సిబ్బంది కలిపి జరిపిన దాడిలో 685 గంజాయి మొక్కలు, 17.741 కేజీల గంజాయి, 0.897 గ్రాముల గంజాయి విత్తనాలు, రూ. 30 వేల నగదు, ఫోను ,గంజాయిని తూకం వేసి వేయింగ్ మీషన్, గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 70 లక్షల మొక్కలు, గంజాయి ఉంటుందని అంచనా వేశారు. గురువుగా, గుడి పూజారిగా, ఆవుటి నాగయ్య మహారాజ్‌గా చెలమణి అవుతున్న ఈ వ్యక్తి భార్య చనిపోయింది. ఇద్దరు అడ పిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. అనంతరం ఒక ఆశ్రమంలో కొంతకాలం ఉండి వచ్చి గ్రామంలోని గుడి పూజారిగా అవతారం ఎత్తాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. పూజ కోసం పూలు పెంచాల్ని స్ధలంలో పూల మొక్కలతోపాటు గంజాయి మొక్కలు సాగు సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని అర్జిస్తు ఎక్సైజ్ సిబ్బంది పట్టుబడ్డారు. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కలు, గంజాయి విత్తనాలను గురూజీగా చెలమణి అవుతున్న ఆవుటి నాగయ్య మహారాజ్‌ను అరెస్టు చేసి నారాయణఖేడ్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. గంజాయిని పట్టుకున్న డీటీఎఫ్ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్‌వాజ్‌ఖాసీం, మెదక్ డిప్యూటి కమిషనర్ జె.హరికిషన్, అసిస్టెంట్ కమిషన్ శ్రీనివాసరెడ్డి, ఈఎస్ నవీన్ చంద్రా, ఏఈఎస్ మణేమ్మలు అభినందించారు.






