ఆ మొక్కలను వెంటనే తొలగించాలి... లేకపోతే ముప్పు వాటిల్లే అవకాశముంది: సీపీఐ నాయకులు

by S Gopi |   (  Updated:2022-11-26 11:09:33  IST  )

మండలంలోని అన్ని గ్రామాలలో హరితహారంలో భాగంగా నాటినటువంటి కోనో కార్పస్ మొక్కలను వెంటనే తొలగించాలని...CPI Leaders gave memorandum to MPDO

ఆ మొక్కలను వెంటనే తొలగించాలి... లేకపోతే ముప్పు వాటిల్లే అవకాశముంది: సీపీఐ నాయకులు
X

దిశ, గన్నేరువరం: మండలంలోని అన్ని గ్రామాలలో హరితహారంలో భాగంగా నాటినటువంటి కోనో కార్పస్ మొక్కలను వెంటనే తొలగించాలని కోరుతూ సీపీఐ నాయకులు మండల అభివృద్ధి అధికారికి శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి కాంతాల అంజిరెడ్డి మాట్లాడుతూ "కోనో కార్పస్" మొక్కల వలన మానవాళికి ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరించినా ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోకపోవడం చాలా బాధాకరం అని అన్నారు. కొన్ని గ్రామాలలో పాఠశాలల ఆవరణలలో, ఇళ్ళ మధ్య మొక్కలు పెంచడం వలన శ్వాస కోశ సంబంధ వ్యాధులతో ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే "కోనో కార్పస్" మొక్కలను తొలగించి వాటి స్థానంలో ఇతర మొక్కలను నాటాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శులు చొక్కల్లా శ్రీశైలం, మొలుగురి సంపత్, మండల కోశాధికారి ఘర్షకుర్తి శ్రీనివాస్, ఏఐవైఎఫ్ యువజన సంఘం నాయకుడు మొలుగురి ఆంజనేయులు, బోయిని మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story