ప్రజల కోసమే సీపీఐ వందేళ్ల పోరాటం : సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు పశ్య పద్మ

by Nallavelli.Anjaneyulu |

దిశ , జహీరాబాద్: ప్రజల కోసమే సీపీఐ వంద సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేసిందనడానికి ఈ 100 సంవత్సరాల ఉత్సవాలే నిదర్శనమని ఆ పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు పశ్య పద్మ అన్నారు.

ప్రజల కోసమే సీపీఐ వందేళ్ల పోరాటం : సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు పశ్య పద్మ
X

దిశ , జహీరాబాద్: ప్రజల కోసమే సీపీఐ వంద సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేసిందనడానికి ఈ 100 సంవత్సరాల ఉత్సవాలే నిదర్శనమని ఆ పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు పశ్య పద్మ అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సు యాత్ర జహీరాబాద్ చేరుకుంది. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్ ఆద్వర్యంలో యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. పటేల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ నుంచి భారత్ నగర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్యరావు, కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ , మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ సీపీఐ పార్టీ నేతలు భరత్ నగర్ 25 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా వ్యవస్థాపకుడు సీపీఐ నాయకుడు అహ్మద్ కు నివాళులర్పించారు. అనంతరం 25 కిలోల కేక్ కట్ చేసి భరత్ నగర్ వాసులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు పశ్య పద్మ మాట్లాడుతూ.. బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా కొట్లాడింది కూడా ఈ పార్టీయే నన్నారు. ప్రస్తుతం ప్రజల పక్షాన ఏ సమస్య ఉన్న సీపీఐ వారికి అండగా పోరాటం చేస్తుందన్నారు. భారత దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో కులమతాలలో రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ టీ, నరసింహ జిల్లా, స్థానిక నేతలు, భరత్ నగర్ వాసులు, అభిమానులు పాల్గొన్నారు.

Next Story