ప్రేమ వివాహం చేసుకున్న జంటకు వేధింపులు..న్యాయం కోసం దీక్ష

by Taduka Kalyani |

గత నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకోగా.. అత్తమామల తో పాటు బావలు తమ ను వేధింపులకు గురి చేస్తున్నారని నంగునూరు గ్రామానికి చెందిన కోలా శ్రీకాంత్ గౌడ్ వరలక్ష్మి లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రేమ వివాహం చేసుకున్న జంటకు వేధింపులు..న్యాయం కోసం దీక్ష
X

దిశ, నంగునూరు : గత నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకోగా.. అత్తమామల తో పాటు బావలు తమ ను వేధింపులకు గురి చేస్తున్నారని నంగునూరు గ్రామానికి చెందిన కోలా శ్రీకాంత్ గౌడ్ వరలక్ష్మి లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగేంత వరకు దీక్ష విరమించేది లేదని మండుటెండలో మండల కేంద్రమైన నంగునూరు అంబేద్కర్ విగ్రహం ముందు కూర్చొని ఇద్దరు చిన్నారులతో భార్యాభర్తలు దీక్ష చేపట్టారు. దీక్ష చేపట్టిన నాటి నుంచి తమపై కుట్రలు పన్నుతున్నారని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. టెంట్ వేసుకుని కూర్చుంటే టెంటు సైతం రాజకీయ పలుకుబడితో తీసివేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. నంగునూరు గ్రామానికి చెందిన కోల శ్రీకాంత్ గౌడ్ గత మూడున్నర ఏళ్ల క్రితం కడపకు చెందిన వరలక్ష్మిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అప్పటినుండి తమకు అత్తమామలతో పాటు బావలు వేధింపులు గురి చేస్తున్నారని శ్రీకాంత్ భార్య వరలక్ష్మి ఆరోపించారు. గత సంవత్సరం తమకు న్యాయం చేయాలని టవరెక్కి ఆత్మహత్య ప్రయత్నం చేయగా బుజ్జగించి తమకు న్యాయం చేస్తామని చెప్పిన రాజగోపాల్ పేట పోలీసులు ఇప్పటివరకు తమకు న్యాయం చేయలేదని ఎఫ్ఐఆర్ నుండి ఐదుగురిని తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై వేధింపులకు గురిచేసి నిండు గర్భిణి అని చూడకుండా దాడికి పాల్పడిన మా అత్తమామల తోపాటు బావలపై చర్యలు తీసుకోవాలని వరలక్ష్మి కుటుంబం పోలీసులను వేడుకున్నారు.

Next Story