- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల్లో టీమ్ స్పిరిట్ కు దోహదం
దిశ, జహీరాబాద్ : ఆటల పోటీలు విద్యార్థుల్లో టీమ్ స్పిరిట్ దోహద పడుతుందని, దీంతో వారిలో ఆత్మస్థైర్యం పెరిగి జీవితంలో గెలుపుకు నాందిగా నిలుస్తుందని

దిశ, జహీరాబాద్ : ఆటల పోటీలు విద్యార్థుల్లో టీమ్ స్పిరిట్ దోహద పడుతుందని, దీంతో వారిలో ఆత్మస్థైర్యం పెరిగి జీవితంలో గెలుపుకు నాందిగా నిలుస్తుందని టేమ్రిస్ రీజినల్ కోఆర్డినేటర్ బహుమతి అన్నారు. జహీరాబాద్ మండలంలోని అల్గోల్డ్ టేమ్రిస్ లో జరుగుతున్న స్పోర్ట్స్ మీట్ కు కోఆర్డినేటర్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు చక్కని మార్గదర్శనం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్ఎల్సీ కార్యక్రమం చక్కని మార్గదర్శనం చేశారు స్పోర్ట్స్ మీట్ కు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 10 కళాశాలల నుంచి 1000 విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. స్థానిక కళాశాల ఆవరణలో ఇండోర్, ఔట్డోర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అయిన కబడ్డీ, కోకో, వాలీబాల్ , ఫుట్బాల్, రన్నింగ్, చెస్, టెన్నికాయిట్ తదితర క్రీడ విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్ వసీముద్దీన్, ప్రిన్సిపల్ షహనాజ్ బేగం, సీఓఈ ఇంఛార్జి కలిముద్దీన్ సిద్ధికి జమీల్, ప్రశాంత్ గౌడ్ , వివిధ కళాశాల నుంచి వచ్చిన పీడీ, పీఈటీలు, విద్యార్థులు ఉన్నారు.






