చంటి బిడ్డకు కానిస్టేబుల్ కాపలా!

by Ratna Kumari |

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో ఓటింగ్ సరళిలో ఓ సంఘటన అందరినీ ఆకర్షించింది. గ్రామానికి చెందిన

చంటి బిడ్డకు కానిస్టేబుల్ కాపలా!
X

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో ఓటింగ్ సరళిలో ఓ సంఘటన అందరినీ ఆకర్షించింది. గ్రామానికి చెందిన ఇద్దరు దంపతులు ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్ కి వచ్చారు. అయితే నెలలు నిండిన వారి పసి పాపను అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గీత ఎత్తుకొని కాసేపు లాలిచ్చింది. ఆ పసిపాప తల్లిదండ్రులు ఇద్దరు ఓటు వేసి బయటికి వ చ్చేంత‌వరకు ఆ చంటి పాపను కానిస్టేబుల్ ఎత్తుకొని తన డ్యూటీని కొనసాగించింది. ఇది చూసిన స్థానికులు ఓ వైపు పోలీస్ డ్యూటీ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ.. మరోవైపు తల్లి ప్రేమను కూడా పసి పాపపై చూపించడం భేష్ అంటూ స్థానికులు ఆమెను అభినందించారు.

Next Story