- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు అండగా కాంగ్రెస్.. ఐదుగురు సభ్యులతో కమిటీ : మంత్రి పొన్నం ప్రభాకర్
రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటి వేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

దిశ, కోహెడ : రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటి వేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం కోహెడ మండల కేంద్రంలోని సింగరాయ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పీసీసీ జనరల్ సెక్రెటరీ సౌజన్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆఫ్ లైన్ నుంచి ఆన్ లైన్ కి ఉండడం వల్ల రైతులకు ఇబ్బందులు రావడం వల్ల మళ్ళీ ఆఫ్ లైన్ లో కొనుగోలు జరుగుతున్నాయని రైతులు గమనించాలన్నారు. గ్రామాల్లో తాగునీరు సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిది అని.. ప్రజలు అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి ఫలితాల్లో మంచి అత్యుత్తమ ఫలితాలు లభించాయని.. మనమంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నామని.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలని సూచించారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా అడ్మిషన్ల సంఖ్య పెంచేలా ఒక కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటెల చర్యలు తీసుకోవాలన్నారు. కోహెడ మండలంలో ప్రతి గ్రామంలో ఆర్వీఏం మెడికల్ కాలేజీ ద్వారా హెల్త్ క్యాంప్ లు ఏర్పాటు చేస్తున్నామని.. అందరూ ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ప్రతి బూత్ లో బీఎల్ఏ నియమించాలని.. ఓట్ల సవరణ ద్వారా బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఓట్లు తొలగిస్తున్నారని తెలిపారు. తొలగించే ఓట్లు జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. దొంగ ఓట్లు వచ్చిన అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. గ్రామాల్లో వేర్వేరుగా కూర్చొని సమావేశం ఏర్పాటు చేసుకొని గ్రామాల సమస్యలు పెండింగ్ పనులు అంశాలు చెప్పడంతో పాటు ఐదు అంశాలపై ఐదుగురు సభ్యులతో కమిటీ ఇవ్వాలని తెలిపారు. గ్రామాల్లో, మండలాల్లో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తల మీద ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బోయిన నిర్మల జయరాజ్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, సీనియర్ నాయకులు, వార్డు సభ్యులు, ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






