బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు..

by Kodari Anjali |

గజ్వేల్ మండలం అక్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు.

బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు..
X

దిశ, గజ్వేల్: గజ్వేల్ మండలం అక్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం శాసనసభాపక్ష ఉపనేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తన్నీరు హరీష్ రావు వారిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి గులాబీ కండువాలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ చేరిన వారిలో బుడుగు ఎల్లం (సింగర్), మాదరబోయిన శేఖర్, మంద రవి, బత్తిని భాను, గుండబోయిన రాజు, దామరకుంట మహేందర్, రాహుల్, విజయ్ తో పాటు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్ అత్తిలి శ్రీనివాస్, ఉద్యమకారులు నర్సింగరావు, నాయకులు గోలి సంతోష్ , మన్నే వెంకటేష్, కనక సేన, కప్ప పోచయ్య, గుంటుకు రాజు, మరికంటి కనకయ్య, అక్కారం మాజీ సర్పంచ్ బాలచందర్ తదితరున్నారు.

Next Story