'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్ భయం పట్టుకుంది'

by Vinod kumar |   (  Updated:2022-12-14 15:06:24  IST  )

కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలకు కాంగ్రెస్ భయం పట్టుకుందని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సూర్య వర్మ అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్ భయం పట్టుకుంది
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలకు కాంగ్రెస్ భయం పట్టుకుందని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సూర్య వర్మ అన్నారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై పోలీసుల దాడి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్లెక్సీ లను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా పోరాటాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పడికప్పుడు స్పందిస్తున్న కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం పై పోలీసుల దాడి హేయమైన చర్య అన్నారు. పోలీసులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ టీపీసీసీ ఆధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై పార్లమెంట్ సాక్షిగా అహంకార పూరితంగా మాట్లాడడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. నిర్మలా సీతారామన్ వెంటనే రేవంత్ రెడ్డి కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మీ, నాయకులు చొప్పదండి చంద్రశేఖర్, దాస అంజయ్య, మార్క సతీష్ గౌడ్, ఫయాజ్, రాకేష్. గ్యాదారి మధు తదితరులు పాల్గొన్నారు.

Next Story