జహీరాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరాలి

by Ratna Kumari |

జహీరాబాద్ పార్లమెంట్ పరిదిలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

జహీరాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
X

దిశ, సంగారెడ్డి బ్యూరో : జహీరాబాద్ పార్లమెంట్ పరిదిలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్ లో మంత్రులు దామోదర రాజనరసింహ, అజారుద్దీన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్ లతో కలిసి మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని, పైరవీలకు ఏ మాత్రం ఆస్కారం ఉండకుండా చూడాలన్నారు. వ్యూహాత్మకంగా ఎన్నికల బరిలోకి వెళ్లాలని, అందుకు అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించారు. అభ్యర్థుల ఎంపిక, బీ ఫారాల పంపిణీపై మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి ఆయా మున్సిపాలిటీను కైవలం చేసుకోవాలని, ఇందుకోసం ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సమీక్షలో చర్చించారు. కాంగ్రెస్ కు ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటుందని, సమిష్టి కృషితో మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని మంత్రులు దామోదర, అజారుద్దీన్, నిర్మలా జగ్గారెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన మోహన్ రావులు ధీమా వ్యక్తం చేశారు. ఆయా జిల్లాల ఇన్ చార్జిల మంత్రుల చేతుల మీదుగా భీపారాలు అందించాలని సమీక్షలో నిర్ణయించారు.

Next Story