కాంగ్రెస్, బీజేపీలు ఉద్యోగులకు వ్యతిరేకం : బీఆర్ఎస్ మున్సిపల్ ఇన్ చార్జి దేవీప్రసాద్

by Nallavelli.Anjaneyulu |

ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ మున్సిపల్ ఇన్ చార్జి దేవీప్రసాద్ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్, బీజేపీలు ఉద్యోగులకు వ్యతిరేకం :  బీఆర్ఎస్ మున్సిపల్ ఇన్ చార్జి దేవీప్రసాద్
X

దిశ, జహీరాబాద్ : ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ మున్సిపల్ ఇన్ చార్జి దేవీప్రసాద్ పిలుపునిచ్చారు. జహీరాబాద్ పట్టణంలో రిటైర్డ్ ఉద్యోగుల రిపబ్లిక్ డే వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను హరిస్తున్న పాలకులకు వ్యతిరేకంగా బుద్ధిజీవులు పోరాటం చేయాలని కోరారు. గతంలో టీడీపీ ప్రభుత్వం 9 డీఏ లు పెండింగ్ పెడితే ఉద్యోగులు చంద్రబాబును ఓడించిన విష‌యాన్ని గుర్తు చేశారు. పెన్షనర్స్ ఉద్యోగులు ఐక్యంగా పోరాడాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను రెండేళ్ళుగా అమలు చేయకపోవడం దారుణమన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావలసిన పెన్షన్ ప్రయోజనాలు ఇవ్వకపోవడంతో మృతిచెందిన 43 మంది మరణాలకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతన్నారు.

ఎప్ప‌టిలోపు చెల్లిస్తారు..?

దాదాపు 20,500 మంది రిటైర్ అయిన ఉద్యోగులకు రూ.13,000 కోట్ల ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ ఆరోగ్య కార్డ్స్ పై కనీస స్పందన లేదన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులకు భవిష్యత్ లో పీఆర్సీ, డీఏ లు రాకుండా చట్టాలు చేయడం అమానుషమన్నారు. భారత దేశంలోనే 5 విడుతల కరువు భత్యం బకాయ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం విచారకరమన్నారు..కేసీఆర్ ప్రభుత్వం గతంలో రెండు పీఆర్సీ లు అమలు చేసి 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చిందని, సకాలంలో జూలై 23 లో పీఆర్సీ వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ జహీరాబాద్ అధ్యక్షులు గడ్డం జనార్దన్, నరోత్తం, పటెల్ రాజేందర్ రావు, చంద్రశేఖర్, ప్రభాకర్ తో పాటు పెన్షనర్స్ పాల్గొన్నారు.

Next Story