- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆన్‌లైన్ మందులపై ఆందోళన…
కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నేతలు స్పీకర్‌ను కలిసి ఆన్‌లైన్ ద్వారా మందుల విక్రయాల వల్ల ఏర్పడుతున్న సమస్యల గురించి చెప్పుకున్నారు.

దిశ, చేగుంట: తెలంగాణ రాష్ట్రంలో ఆన్‌లైన్ ద్వారా మందుల విక్రయాల వల్ల ఏర్పడుతున్న సమస్యలపై తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తోడుపునూరి రాజు ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం శుక్రవారం రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తోడుపునూరి రాజు మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో నియంత్రణ లేకుండా మందులు కొనుగోలు చేయడం వల్ల ప్రజలు, యువత తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం కూడా పెరుగుతున్నదని దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆన్‌లైన్ మందుల విక్రయాలపై సరైన నియంత్రణలు అమలు చేసి ఫార్మసీ వ్యవస్థను రక్షించడమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్రీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మాడూరు వినోద్ కుమార్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు వి శ్రీనివాస్, అలాగే కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






