- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సకాలంలో ప్రభుత్వ భవన నిర్మాణాలను పూర్తి చేయండి: కలెక్టర్ రాజశ్రీ షా
by Taduka Kalyani |
సకాలంలో ప్రభుత్వ భవన నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.

X
దిశ, మనోహరాబాద్: సకాలంలో ప్రభుత్వ భవన నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మండల కేంద్రమైన మనోహరాబాద్ లో రూ. 5 కోట్లతో నిర్మాణం ప్రారంభించిన సమీకృత ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని, రూ. 2 కోట్లతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణాన్ని గురువారం కలెక్టర్ పరిశీలించారు.
నాణ్యత ప్రమాణాలతో ఈ భవనాలను సకాలంలో పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చి ప్రజల, రోగుల ఇబ్బందులను తొలగిస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట గడ అధికారి ముత్యంరెడ్డి, తూప్రాన్ ఆర్డీవో శ్యాం ప్రకాష్, పీఆర్ బీఈ నర్సింహులు, తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీవో యాదగిరిరెడ్డి, పీహెచ్ సీ డాక్టర్ ఆనంద్ తదితరులు ఉన్నారు.
Next Story






