- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Community Contact Program : పుల్లూరులో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
సిద్దిపేట రూరల్ మండల పరిధి పుల్లూరు గ్రామంలో శనివారం ఏసీపీ మధు ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట రూరల్ మండల పరిధి పుల్లూరు గ్రామంలో శనివారం ఏసీపీ మధు ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. 25 మోటార్ సైకిల్ వాహనాల పేపర్లు తనిఖీ చేసి పేపర్లు లేని వాహనాలను సీజ్ చేశారు. అదే విధంగా ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బెల్ట్ షాపు లో రూ. 6వేల లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. రూ.3 వేల విలువ
గల ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు టొబాకో సీజ్ చేశారు. అదే విధంగా లిక్కర్, గుట్కాలు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మధు మాట్లాడుతూ...నూతన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ శ్రీను, వన్ టౌన్ సీఐ లక్ష్మీ బాబు, త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్, రూరల్ ఎస్ఐ అపూర్వరెడ్డి, చిన్నకోడూరు ఎస్ఐ బాలకృష్ణ, బెజ్జంకి ఎస్ఐ కృష్ణారెడ్డి, రాజగోపాలపేట ఎస్ఐ ఆసిఫ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






