- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేరాల నియంత్రణ కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్
దిశ, పటాన్ చెరు : నేరాల నియంత్రణకు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తున్నామని పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. సంగారెడ్డి ఎస్పీ ఆదేశాల

దిశ, పటాన్ చెరు : నేరాల నియంత్రణకు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తున్నామని పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. సంగారెడ్డి ఎస్పీ ఆదేశాల మేరకు పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో రామేశ్వరం బండ వీకర్ సెక్షన్ కాలనీలో డీఎస్పీ ప్రభాకర్ నేతృత్వంలో సుమారు 220 మంది పోలీసులతో నాకా బంధి నిర్వహించారు. ఉదయం 5 గంటలకే కాలనీకి చేరుకున్న పోలీస్ బృందాలు కాలనీని 4 భాగాలు అవుటర్ కార్డన్లు, హోల్డింగ్ పాయింట్, కట్-ఆఫ్ పాయింట్లు, శోధనా బృందాలుగా విభజించి కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్డెన్ సర్చ్ లో 205 మంది అనుమానితులను పాపిలాన్ డివైజ్ ద్వారా పరీక్షించి నలుగురు వ్యక్తులకు నేర చరిత్ర ఉందని గుర్తించారు. ఈ సర్చ్ లో సరైన పత్రాలు లేని 62 మోటార్ సైకిళ్లు, 17 ఆటోలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు.15 వాహనాలకు ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానా జరిమానా విధించడంతో పాటు , 17 వాహనాల పెండింగ్ చలాన్లు క్లియర్ చేయించారు. అనంతరం కాలనీ వాసులతో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోలీస్ శాఖ ఆద్వర్యంలో అల్పాహారం అందించారు.
డీఎస్పీ ప్రభాకర్ మాట్లాడుతూ.. పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలసదారులు ఎక్కువగా నివసిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలు, గంజాయి బారిన పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. గంజాయికి అలవాటు పడి, పశ్చాత్తాపంతో ముందుకు వచ్చే వారికి ఉచితంగా చికిత్స,సేవలు అందించడానికి పోలీసు శాఖ సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. నేరాలను అరికట్టడంలో భాగంగా ఇళ్లను అద్దెకిచ్చే యజమానులు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలని సూచించారు. కొత్తగా ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడు, అద్దెదారుల ఆధార్ కార్డుతో సహా పూర్తి వివరాలను సేకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు, అసాధారణ ప్రవర్తన గల అద్దెదారుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు సహకరిస్తామని కాలనీవాసులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పటాన్ చెరు సీఐ వినాయక్ రెడ్డి తో పాటు పలువురు సీఐలు, ఎస్ఐ లతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






