- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర మంత్రిగా పాలనపై అవగాహన లేదు: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
కేంద్ర మంత్రి బండి సంజయ్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.

దిశ, సంగారెడ్డి బ్యూరో: బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండటం తెలంగాణ ప్రజల దురదృష్టకరమని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. పదేళ్లు రాష్ట్రంలో బీఆర్ ఎస్, కేంద్రంలో బీజేపీ కలిసి సంసారం చేశాయని, మీకు8 రాజకీయ సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. సంగారెడ్డి ఆయన మాట్లాడారు. కేంద్ర జలవనరుల శాఖ మీ దగ్గరే ఉంది, హరీష్ రావుకి పట్టిన రోగమే.. బండి సంజయ్ కి పట్టిందన్నారు. డ్యామ్ సేఫ్టీ అధికారులతో సీఎం, ప్రతిపక్షాలతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేయాలని, అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజానిజాలు బయట పడతాయన్నారు. అవగాహన లేకుండానే బండి సంజయ్ కేంద్ర మంత్రి అయిపోయారని, ప్రధాని మోడీ మీకు ట్రైనింగ్ ఇవ్వకుండా మంత్రి పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. తుంగతుర్తి ఎపిసోడ్ పై ఈ రోజు పీసీసీకి ఇవ్వాల్సిన నివేదిక ఈ నెల 18 లేదా 20 ల లోపు పీసీసీకి నివేదిక అందజేస్తామన్న జగ్గారెడ్డి చెప్పారు. తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయ వ్యవహారాలపై రెండ్రోజుల పాటు అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. ఈ రోజు సాయంత్రం తుంగతుర్తి నివేదికని పీసీసీకి ఇవ్వాలని అనుకున్నాం. కానీ ఇంఛార్జ్ మంత్రి లక్ష్మణ్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ల అభిప్రాయలు తీసుకోవడానికి కొంచెం టైం పడుతుందన్నారు. అందరూ కలిసి సమన్వయంతో కలిసి పని చేసేలా నిర్ణయం తీసుకుంటామని, వచ్చే ఎన్నికల్లోనూ తుంగతుర్తిలో కాంగ్రెస్ గెలిచేలా కృషి చేస్తామని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.






