ప్రీ ప్రైమరీ విధానంతో పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య: ఎమ్మెల్యే సునీతారెడ్డి

by Kodari Anjali |

వెల్మకన్నలో మహిళ సమైక్య భవనంకు సునీతారెడ్డి భూమి పూజ చేశారు.

ప్రీ ప్రైమరీ విధానంతో పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య: ఎమ్మెల్యే సునీతారెడ్డి
X

దిశ, కౌడిపల్లి: ప్రీ ప్రైమరీ విధానంతో గ్రామీణ పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని తునికి, రాజిపేట, సలాబాత్ పూర్, వెల్మకన్న గ్రామాలలో ప్రీ ప్రైమరీ పాఠశాలను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి ప్రారంభించారు. ప్రీ ప్రైమరీ పాఠశాలను గ్రామీణ పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సునీతారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బాలరాజు, ఆయా గ్రామాల సర్పంచులు, బీ ఆర్ఎస్ నాయకులు రామాగౌడ్, మండల బీ ఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు పోల నవీన్ కుమార్, మాజీ వైస్ ఎంపీపీ నవీన్ కుమార్, ఎల్లం, గుంజరి ప్రవీణ్ కుమార్, రవి సాగర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

మహిళా సమైక్య భవనంకు భూమి పూజ

మండల పరిధిలోని వెల్మకన్న గ్రామంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునితారెడ్డి మహిళా సమైక్య భవనంకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నా హయంలో మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేశానని ఈ సందర్భంగా సునీతారెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమ్మరి శివలీల సతీష్, ఉప సర్పంచ్ సందీప్, పార్టీ అధ్యక్షుడు రామాగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ నవీన్ కుమార్ మహిళా సంఘం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story