బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్

by velandi.Saikiran |

శనిగరం గ్రామంలోని బాలుర వసతి గృహాన్ని శనివారం రాత్రి కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా

బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్
X

దిశ, కోహెడ: శనిగరం గ్రామంలోని బాలుర వసతి గృహాన్ని శనివారం రాత్రి కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా అటెండెన్స్ రిజిస్టర్ పై ఆరా తీశారు. మరుగుదొడ్ల సమస్య, వరద సమస్యలపై కలెక్టర్ కు విద్యార్థులు సమాచారం ఇచ్చారు. మరుగుదొడ్ల సమస్య తప్పకుండా పరిష్కరిస్తానని, వర్షపు నీరు చేరకుండా చర్యలు తీసుకుంటానని విద్యార్థులకు హామీ ఇచ్చారు కలెక్టర్ కె. హైమావతి. క్రమశిక్షణతో చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందని విద్యార్థులకు సూచించారు.

Next Story