యూరియాపై రైతుల ఆందోళన వద్దు - కలెక్టర్ రాహుల్ రాజ్

by velandi.Saikiran |

యూరియా కొరత లేకుండా అధికారులు ప్రతీ రోజూ క్షేత్ర స్థాయి పర్యవేక్షణ చేయాలనీ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు

యూరియాపై రైతుల ఆందోళన వద్దు - కలెక్టర్ రాహుల్ రాజ్
X

దిశ,టేక్మాల్: జిల్లాలో ఎక్కడ యూరియా కొరత లేకుండా అధికారులు ప్రతీ రోజూ క్షేత్ర స్థాయి పర్యవేక్షణ చేయాలనీ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు .బుధవారం టేక్మాల్ మండల కేంద్రంలోని తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని , కలెక్టర్ పరిశీలించారు. విక్రయ దారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.స్టాక్ నమోదును అధికారులతో కలిసి పరిశీలించారు.ఎరువుల రైతులతో మాట్లాడారు. కేవలం యూరియా నే కాకుండా నత్రజని ఆధారిత కాంప్లెక్స్ ఎరువులను, నానో యూరియాను కూడా వాడాలని

సూచించారు.ఎరువుల గురించి ఆందోళన చెందకూడదని, సమృద్ధిగా నిలువలు ఉన్నట్లు తెలియజేశారు. కొద్దిమంది కావాలని వదంతులు సృష్టించడం ద్వారా రైతులు సెప్టెంబర్లో కొనవలసిన యూరియా కూడా ఇప్పుడే కొనడానికి షాపుల వద్ద బారులు తీరారని,దింతో రద్దీ పెరుగుతుందని అలానే వదంతులు నమ్మవద్దని వచ్చే పది రోజుల్లో ఇంకా 1500 మెట్రిక్ టన్నుల యూరియా మన జిల్లాకు రావడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని తెలిపారు.

సెప్టెంబర్ లో కూడా మన అవసరానికి తగ్గట్టు 4000 మెట్రిక్ టన్నుల యూరియా వ్యవసాయ శాఖ నుండి మన జిల్లాకు తప్పకుండా పంపడం జరుగుతుందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ తెలిపారని కలెక్టర్ చెప్పారు.యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, యూరియా రెండు రోజులకోసారి వస్తుందని వారి విస్తీర్ణాన్ని బట్టి మళ్ళీ తీసుకోవచ్చు అని కలెక్టర్ రైతులకు తెలియజేశారు.ఏ మండలం లో ఎంత స్టాక్ ఉందనే సమాచారం రైతులకు తెలపాలన్నారు. ఎవరికైన ఇబ్బంది కలిగితే మండల వ్యవసాయ అధికారి లేదా విస్తరణ అధికారిని సంప్రదించాలన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story