- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మధ్యాహ్న భోజనం నాణ్యతపై కలెక్టర్ ఆగ్రహం
దిశ, గజ్వేల్ రూరల్ : గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

దిశ, గజ్వేల్ రూరల్ : గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మేనులో భాగంగా బగారా అన్నం, తోటకూర పప్పు వండినట్లుగా వంట సిబ్బంది తెలుపగా ఆహారపదర్థాలను తనిఖీ చేశారు. బాగారా అన్నం నాణ్యత సరిగ్గా లేనందున వంట సిబ్బంది పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు ఇలాగే పెడుతున్నారా అంటూ బాగారా అన్నం ఎలా చేస్తారో తెలీదా అని మండిపడ్డారు. పిల్లలకు పౌష్టికాహారం అందించకుండా విధులు ఎలా నిర్వహిస్తున్నారని హెడ్ మాస్టర్ మరియు ఫుడ్ చెకింగ్ టిచర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కామన్ డైట్ మెనూ పాటించాలని రోజు మధ్యాహ్న భోజన వంట ప్రక్రియను పర్యవేక్షణ చెయ్యాలని హెడ్ మాస్టర్ ను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఏ తరగతి, ఆహారం ఎలా ఉంది, నిన్న - నేడు ఏం తిన్నారు, రుచి ఎలా ఉంది అని విద్యార్థులతో ఆప్యాయంగా పలకరించారు. ఆహారం కడుపునిండా తినాలని అప్పుడే శారీరకంగా బలంగా ఉంటారని పిల్లలకు సూచించారు. చదువు, ఆహారం విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులను ఆదేశించారు.






