- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెడ్డి నీ అయ్యా జాగీరా..?
దిశ, అందోల్ : "రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పట్టించుకోకుండా.. వందల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావ్. నీ

దిశ, అందోల్ : "రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పట్టించుకోకుండా.. వందల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావ్. నీ అయ్య జాగీరా రేవంత్‌రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటుగా నిలదీశారు. మెస్సీతో పుట్ బాల్ ఆడేందుకు రూ.100 కోట్లు...అందాల పోటీకి రూ.100 కోట్లు.. సీఎం ప్రాక్టిస్‌కు రూ.5 కోట్లు ఇలా ప్రజల సోమ్మును అడ్డగొలుగా ఖర్చు చేసే హక్కు నీకేక్కడిది" అని ప్రశ్నించారు హరీశ్ రావు. శనివారం అందోలులోని ఓ ఫంక్షన్ హాల్‌లో నూతనంగా గెలుపొందిన బీఆర్‌ఎస్ సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉందని.. ప్రజలను ఎన్నో ప్రలోభాలకు గురిచేసినా.. బీఆర్‌ఎస్ సర్పంచ్‌లు 40 శాతం గెలిపించి, ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కారు స్పీడ్ చూసి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పెట్టడానికి సీఎం రేవంత్ ముందుకు రావడం లేదన్నారు. రెండేళ్ల పాలనలో రెండు సార్లు రైతుబంధు ఎగ్గొట్టాడాని, కరోనా సమయంలోనూ కేసీఆర్ రైతుబంధు అపలేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చి, మగవారి దగ్గర డబుల్ టిక్కెట్ వసూళ్లు చేస్తున్నారన్నారు. రెండేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్ పార్టీనేనని, జిల్లాకు తానే మంత్రిగా వస్తానని, పోలీసులు జాగ్రత్తగా ఉండాలని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీఆర్‌ఎస్ నాయకులను వేధిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
గెలిచిన సర్పంచ్‌లు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, వారికి అందుబాటులో ఉండాలన్నారు. సర్పంచ్‌లకు వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులను ఆపే దమ్ము పీఎం, సీఎంలకు కూడా లేదని, నేరుగా సర్పంచ్‌ల ఖాతాల్లో పడే విధంగా అప్పటి సీఎం కేసీఆరేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీనే అధికారంలోకి రావాలని, సీఎంగా కేసీఆర్ ఉండాలని ప్రజలు కొరుకుంటున్నారని, ఇందుకు సంకేతంగా ఈ సర్పంచ్ ఎన్నికల ఫలితాలేనన్నారు. అనంతరం ఆందోలు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు నూతనంగా సర్పంచ్‌లుగా, వార్డు మెంబర్‌లుగా గెలుపొందిన వారిని శాలువాను కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, అందోలు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఏఎంసీ చైర్మన్‌లు పి.నారాయణ, డీబీ నాగభూషణం, పల్లె సంజీవయ్య, మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మికాంతరెడ్డి, ముద్దాయిపేట విజయ్‌కుమార్, శివకుమార్, వీరప్ప, వీరారెడ్డి, విఠల్, మాజీ ఎంపీపీ రామాగౌడ్, కాశీనాథ్, పార్టీ సీనియర్ నాయకులు లింగాగౌడ్, రాహుల్‌కిరణ్, సాయికుమార్, వీరభద్రారావు పాల్గొన్నారు.






