మహిళ అదృశ్యం.. కేసు నమోదు చేసిన పోలీసులు

by Kodari Anjali |

చిరగపల్లి పోలీస్ ఓ మహిళ మిస్సింగ్ కేసు నమోదైంది.

మహిళ అదృశ్యం.. కేసు నమోదు చేసిన పోలీసులు
X

దిశ, జహీరాబాద్: చిరగపల్లి పోలీస్ ఓ మహిళ మిస్సింగ్ కేసు నమోదైంది. మిస్సైన వారిలో మొగుడంపల్లి మండలం మిర్జాంపల్లి తండాకు చెందిన నెనావత్ పండు భార్య నెనావత్ రేఖాబాయి (40) ఉన్నారు. గత 27వ తేదీన ఫిర్యాదుదారు తన కుమారుడితో కలిసి మందులు తెచ్చుకునేందుకు హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆసుపత్రికి వెళ్లగా, రేఖాబాయి ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. తిరిగి వచ్చేటప్పటికీ ఆమె ఇంట్లో లేకపోవడంతో, కుటుంబ సభ్యులు, బంధువుల వద్ద వెతికినా ఆమె ఆచూకి తెలిసి రాలేదు. సుమారు 5 అడుగుల ఎత్తు తెలుపు వర్ణం గల ఆమె ఎరుపు రంగు చీర ధరించారని పేర్కొన్నారు. వివరాలు తెలిసినవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story