బడ్జెట్ సమావేశంలో గందరగోళం

by Batti.Sumithra |   (  Updated:2026-03-30 11:09:55  IST  )

బడ్జెట్ సమావేశంలో గందరగోళం నెలకొంది. స్వల్ప సమస్యల పై సభ్యులు పరస్పర వాగ్వాదం, దాడులు చేసుకుని వాకౌట్ చేసే స్థాయికి చేరుకున్నాయి.

బడ్జెట్ సమావేశంలో గందరగోళం
X

దిశ, జహీరాబాద్ : బడ్జెట్ సమావేశంలో గందరగోళం నెలకొంది. స్వల్ప సమస్యల పై సభ్యులు పరస్పర వాగ్వాదం, దాడులు చేసుకుని వాకౌట్ చేసే స్థాయికి చేరుకున్నాయి. తోటి సభ్యులు, చైర్మన్ కల్పించుకోవడంతో ఆగుతూ.. సాగుతూ సభ కొనసాగింది. బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా సమావేశం ప్రారంభానికి ముందే పలువురు కౌన్సిలర్లు గత సమావేశంలో ప్రస్తావించిన అంశాల పురోగతిని కోరారు. ఇదే క్రమంలో రోడ్డు పై ఫ్లెక్సీల ఏర్పాటు అంశాన్ని, డివైడర్ల పై ఏర్పాటు చేసిన జెండాల తొలగింపు తదితర అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు బొగ్గుల సంతోష్, మహమ్మద్ జాహంగీర్ ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోగా సంతోష్ వాకౌట్ చేసి సభలో నుంచి వెళ్లిపోయారు. అదే విధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య సమస్యల ప్రస్తావన విషయంలో చాలినంత టైం ఇవ్వక పోవడంతో సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం బడ్జెట్ ప్రవేశపెట్టారు. చైర్మన్ మహమ్మద్ యూనూస్ అధ్యక్షతన జరిగిన సభ 2026-27 అంచనా బడ్జెట్ రూ.3080.46 లక్షలకు ఆమోదం తెలిపింది.

Next Story