- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉద్యమస్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ
ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

దిశ, సంగారెడ్డి : ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ పక్కనగల చాకలి ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని, తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావి తరాలకు అందించాలని కోరారు.
ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, సాయుధ పోరాటానికి వారసురాలు ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల శాఖ అధికారి జగదీష్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజీ అనంతకిషన్, రజక సంఘం ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






