లిఫ్ట్ ఇచ్చి చైన్ స్నాచింగ్… నిందితుడు రిమాండ్‌

by Kodari Anjali |

లిఫ్ట్ ఇస్తానని మాయమాటలు చెప్పి మహిళను మోసం చేసి బంగారు ఆభరణాలు దోచుకున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

లిఫ్ట్ ఇచ్చి చైన్ స్నాచింగ్… నిందితుడు రిమాండ్‌
X

దిశ, దౌల్తాబాద్: లిఫ్ట్ ఇస్తానని మాయమాటలు చెప్పి మహిళను మోసం చేసి బంగారు ఆభరణాలు దోచుకున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏప్రిల్ 26, 2026న ఉదయం సుమారు 8 గంటల సమయంలో దౌల్తాబాద్ శివాజీ విగ్రహం వద్ద ఒక మహిళ ఆటో కోసం ఎదురుచూస్తుండగా ఒక గుర్తుతెలియని వ్యక్తి తాను గొడుగుపల్లి గ్రామానికి వెళ్తున్నానని చెప్పి ఆమెను తన మోటార్ సైకిల్‌పై ఎక్కించుకున్నాడు. దీపంపల్లె గ్రామ శివారులోని culvert వద్దకు చేరుకున్న తర్వాత బైక్‌లో పెట్రోల్ అయిపోయింది. అంటూ బండి ఆపి మాయమాటలు చెప్పి మహిళ మెడలో ఉన్న 3 తులాల బంగారు తాడు, 2 గ్రాముల బంగారు చెవి పోగులు, 20 తులాల వెండి కాళ్ల పట్టీలు లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రామారం గ్రామం రాయపోల్ మండలానికి చెందిన ఎరుకలి శ్రీను (30) ను గుర్తించి ఈ రోజు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.

నిందితుని వద్ద నుండి రికవరీ చేసినవి..

28.50 గ్రాముల బంగారు పుస్తెల తాడు

2.07 గ్రాముల బంగారు చెవి పోగులు

190.30 గ్రాముల వెండి పట్టి గొలుసులు

నేరానికి ఉపయోగించిన హీరో గ్లామర్ బైక్

ఒక ఒప్పో మొబైల్ ఫోన్

స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల హెచ్చరిక...

లిఫ్ట్ ఇస్తామని మాయమాటలు చెప్పే వ్యక్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ కేసును ఛేదించిన దౌల్తాబాద్ ఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లు విక్రమ్, నాగరాజు, స్వామిలను సీఐ ఎస్.కే. లతీఫ్ అభినందించారు.

Next Story