- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైన్ స్నాచర్ అరెస్ట్.. 4 తులాల బంగారం స్వాధీనం
రామచంద్రాపురం మండల పరిధిలో మహిళ మెడలోని బంగారు గొలుసును అపహరించిన చైన్ స్నాచర్‌ను కొల్లూరు పోలీసులు కేవలం 12 గంటల్లోనే అరెస్ట్ చేసి, దొంగిలించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

దిశ, రామచంద్రాపురం : రామచంద్రాపురం మండల పరిధిలో మహిళ మెడలోని బంగారు గొలుసును అపహరించిన చైన్ స్నాచర్‌ను కొల్లూరు పోలీసులు కేవలం 12 గంటల్లోనే అరెస్ట్ చేసి, దొంగిలించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొల్లూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లూరు గ్రామంలోని దేవుల తండాకు చెందిన పాత్లోత్ బాలమ్మ (48) కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంది. ఈ నెల ఏడో తేదీన ఉదయం 6:30 గంటల సమయంలో లింగంపల్లి కూరగాయల మార్కెట్‌కు వెళ్లేందుకు అండర్‌పాస్ వద్ద వాహనం కోసం వేచి ఉండగా, నిందితుడు మురుగొండ రాఘవేందర్ ఆమె మెడలో ఉన్న సుమారు 4 తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కొల్లూరు పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ల సహకారంతో పోలీసులు నిందితుడి ఆచూకీని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఖాద్రీ చమన్, ఫలక్‌నామా ప్రాంతానికి చెందిన మురుగొండ రాఘవేందర్ (36) ప్రస్తుతం రామచంద్రాపురం మండలంలోని ఈదులనాగులపల్లి డబుల్ బెడ్‌రూమ్ ఫేజ్-IIIలో నివాసం ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన 12 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి దొంగిలించిన 4 తులాల బంగారు పుస్తెల తాడును స్వాధీనం చేసుకున్న పోలీసులు, అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.త్వరిత గతిన కేసు ఛేదించిన పోలీసులకు స్థానికులు అభినందిస్తున్నారు.






