- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దళిత కార్యకర్త ఇంట్లో కేంద్రమంత్రి అల్పాహారం
కేంద్ర మంత్రి పరుషోత్తమ్ రూపాలా 2వ రోజు జహీరాబాద్ లో పర్యటించారు. బుధవారం రాత్రి జహీరాబాద్ చేరుకున్న... Central Minister Purushottam visits Jaheerabad

X
దిశ, జహీరాబాద్: కేంద్ర మంత్రి పరుషోత్తమ్ రూపాలా 2వ రోజు జహీరాబాద్ లో పర్యటించారు. బుధవారం రాత్రి జహీరాబాద్ చేరుకున్న మంత్రి కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఉపముఖ్యమంత్రి సోదరుడు రాంచందర్ రాజనర్సింహాతోపాటు పలువురు నేతలను పార్టీలో చేర్చుకున్నారు. గురువారం నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలం గంగ్వార్రం గ్రామానికి చేరుకున్నారు. స్థానికంగా మండల దళిత నాయకులు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్ కుటుంబంలో అల్పాహారం స్వీకారించారు. అనంతరం గంగ్వార్ శక్తి కేంద్రంలో మండల బూత్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై పార్టీ శ్రేణులనులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా, నియోజకవర్గం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story






