- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, నారాయణఖేడ్: అక్రమంగా పత్తిపంటలో గంజాయి సాగు చేస్తున్న సమాచారంతో తనిఖీకి వెళ్లిన ఎక్సైజ్ , టాస్క్ ఫోర్స్ పోలీసులపై తండా వసూలు తిరగబడ్డారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చల్లగిద్ద తండాలో ఈ ఘటన జరిగింది. గంజాయి ధ్వంసం చేయడానికి వెళ్లిన పోలీసులపై దాడులు చేసే ప్రయత్నం చేశారు. పోలీసుల ఫోన్లు లాక్కొని వారిపై తిరగబడ్డారు. జానకి రామ్ అనే వ్యక్తి పత్తిపంటలో మిశ్రమ పంటగా గంజాయి సాగు చేస్తున్నాడనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లి 60గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. గంజాయి మొక్కలను ధ్వంసం చేస్తుండగా తండావాసులు తిరగబడ్డారు.
జానకి రామ్ ఇంట్లో ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తీసుకున్న గంజాయిని తండావాసులు తిరిగి తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఎక్సైజ్ పోలీసులు నారాయణఖేడ్ డీఎస్పీ వెంకటరెడ్డికి సమాచారం ఇవ్వడంతో అదనపు పోలీసులతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తండావాసులతో చర్చించారు. నారాయణఖేడ్ మండలం చల్లగిద్ది తండాకు చెందిన వాడిత్య దశరథ్, వాడిత్య మోహన్ ఇద్దరు వ్యక్తులు అక్రమంగా ఎండుగంజాయిని విక్రయిస్తున్నారని సమాచారంతో వారి ఇంటిపై దాడి చేసి, వారి వద్ద నుంచి 4.2 కిలోల ఎండు గంజాయిని, 1.5 కిలోల గంజాయి విత్తనాలను, టీవీఎస్ వాహనం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ సోదాల్లో తండావాసులు... కొందరు అధికారులను తిడుతూ భౌతికంగా దాడి చేసి గాయపరిచారు. దాడి చేసిన వారిపై నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ లో ఎక్సైజ్ అధికారులు ఫిర్యాదు చేశారు. తండాలో ఒకేసారి దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. సర్వే నెంబర్లు తెలుసుకొని కేసు నమోదు చేస్తామని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.






