- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవయవ దానం చేసి.. ఐదుగురు జీవితాల్లో వెలుగులు
by Taduka Kalyani |
ఓ రైతు అవయవ దానం చేసి ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన భూమా గౌడ్ (63) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు.

X
దిశ, నిజాంపేట: ఓ రైతు అవయవ దానం చేసి ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన భూమా గౌడ్ (63) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు. ఈనెల 7న ఇంట్లో ఉన్న సమయంలో అధిక రక్తపోటు కారణంగా కింద పడిపోయారు. గమనించిన కుటుంబీకులు వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడినుండి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జీవధాన్ వైద్య బృందం కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించగా, వారు అంగీకరించారు. దీంతో రెండు కిడ్నీలు, కాలేయం, కంటి అవయవాలను సేకరించి అవసరమైన రోగులకు మార్పిడి చేశారు. భూమా గౌడ్ కుటుంబం అవయవ దానం ద్వారా ఐదుగురు జీవితాల్లో వెలుగు నింపింది.
Next Story






