- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగలకు దేహశుద్ధి
బైక్ లు దొంగిలిస్తున్న దొంగలను గ్రామస్థులు చాకచక్యంగా పట్టుకుని వారి దేహశుద్ధి చేసిన ఘటన దుబ్బాక మండలం బొప్పాపూర్ లో మంగళవారం చోటుచేసుకుంది.

దిశ, దుబ్బాక : బైక్ లు దొంగిలిస్తున్న దొంగలను గ్రామస్థులు చాకచక్యంగా పట్టుకుని వారి దేహశుద్ధి చేసిన ఘటన దుబ్బాక మండలం బొప్పాపూర్ లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన స్వామి అనే వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని గత మూడు రోజుల క్రితం దొంగలు ఎత్తుకెళ్లారు. తిరిగి అదే వాహనాన్ని కల్వకుంట గ్రామం వద్ద దొంగలు విక్రయిస్తున్నారని సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకొని దొంగలను చితకబాదారు. బొప్పాపూర్ గ్రామానికి చెందిన మైసయ్య, అంబర్ పేటకు చెందిన రాజు ను పట్టుకొని బొప్పాపూర్ గ్రామ పంచాయతీలో గ్రామస్థులు బంధించారు. గతంలో కూడా వీరు ద్విచక్ర వాహనాలను దొంగిలించి అమ్ముకున్నట్లు నిందితులు వెల్లడించారు. ఈజీ మనీ, మద్యానికి బానిసై జల్సాల కోసం ద్విచక్ర వాహనాలతో పాటు వ్యవసాయ పొలాల వద్ద ఉన్న పరికరాలను తరచూ దొంగిలిస్తున్నట్లు నిందితులు గ్రామస్థులు ఆరోపించారు. గతంలో వ్యవసాయ పొలాల వద్ద వ్యవసాయ పరికరాలు, స్టార్టర్లు, కేబుల్ దొంగతనం జరిగిందని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు బొప్పాపూర్ గ్రామానికి చేరుకొని దొంగలను భూంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు.






