సద్ది తిన్న రేవు తలిచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి : మంత్రి హరీష్ రావు

by Kema Shiva Kumar |

సద్దితిన్న రేవు తలిచి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.

సద్ది తిన్న రేవు తలిచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి : మంత్రి హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సద్దితిన్న రేవు తలిచి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని సిద్ధిపేట రూరల్ వెంకటాపూర్-18, నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్-12, గుర్రాలగొంది-8 మంది లబ్ధిదారులకు పీఓటీ భూ సమస్య పరిష్కారం చేసి స్థల ధృవీకరణ పత్రాలు అందజేశారు.

అదేవిధంగా బుస్సాపూర్ గౌడ సంఘ, వెంకటాపూర్ హమాలి సంఘ భవనాలకు కేటాయించిన స్థల కుల సంఘ ధృవీకరణ పత్రాలు అందించారు. గుర్రాలగొంది గ్రామానికి చెందిన ఖాతా రాములు విద్యుత్తు షాక్ తో మృతి చెందగా రాములు భార్య పోచవ్వకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా బాండ్ అందజేశారు. సిద్ధిపేట రూరల్, నారాయణరావుపేట మండల పరిధిలోని 26 మందికి రూ.26 లక్షల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించారు. ఇర్కోడ్ గ్రామంలో ఒక్కరికీ జీవో నెం.59 కింద క్రమబద్ధీకరణ ప్రోసీడింగ్ కాపీ మంత్రి హరీష్ రావు లబ్ధిదారుడికి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యను పరిష్కరించి భూమిపై సర్వహక్కులు కల్పించిన సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి దీవెనలు అందించాలని కోరారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ, తదితర ఎన్నో సంక్షేమ పథకాలు అందించి పేద ప్రజానీకానికి సీఎం కేసీఆర్ అండగా నిలిచారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏలా మారిందో గమనించాలన్నారు. అనంతరం నారాయణరావుపేట మండలం బంజరుపల్లిలో గ్రామంలో మహంకాళి-మాతమ్మ దేవలయ వార్షికోత్సవం, శంకర్ నగర్ లో పెద్దమ్మ, పెద్దిరాజుల కల్యాణోత్సవ వేడుకలలకు హాజరై మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story