- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుక్కల దాడిలో గాయపడిన కృష్ణ జింక
by Kema Shiva Kumar |
కుక్కల దాడిలో గాయపడిన కృష్ణ జింకకు గ్రామస్థులు చికిత్స చేయించి అటవీ అధికారులకు అప్పగించిన ఘటన చిన్నశంకరం పేట మండల పరిధిలోని కామారం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

X
చికిత్స చేయించి అటవీ అధికారులకు అప్పగించిన గ్రామస్థులు
దిశ, చిన్నశంకరంపేట : కుక్కల దాడిలో గాయపడిన కృష్ణ జింకకు గ్రామస్థులు చికిత్స చేయించి అటవీ అధికారులకు అప్పగించిన ఘటన చిన్నశంకరం పేట మండల పరిధిలోని కామారం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోకి కృష్ణ జింక రాగా, దానిపై కుక్కలు దాడి చేయడంతో అది తీవ్రంగా గాయపడింది. దీంతో గ్రామ సర్పంచ్ పూలపల్లి యాదగిరి యాదవ్ అటవీ అధికారులకు సమాచారం అందజేశారు. స్థానిక వెటర్నరీ వైద్యాధికారి గీతా మాలిక జింకకు ప్రథమ చికిత్స చేసి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. జింక ప్రాణాలు కాపాడిన కామారం గ్రామ పంచాయతీ వాటర్ మెన్ దశరథ, సర్పంచ్ యాదగిరి యాదవ్, పశు వైద్యురాలు గీతా మాలికను పంచాయతీ కార్యదర్శి సుహాసిని శాలువాతో సన్మానించారు.
Next Story






