ధాన్యం కొనుగోలులో రైతులకు తీవ్ర ఇబ్బందులు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

by Kodari Anjali |

ధాన్యం సరిగా కొనుగోలు చేయకపోవడంతో.. రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు.

ధాన్యం కొనుగోలులో రైతులకు తీవ్ర ఇబ్బందులు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
X

దిశ, నిజాంపేట: ధాన్యం సరిగా కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. రామాయంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు సరిగ్గా జరపకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, సెంటర్లకు లారీలు సరిగా రాకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం సైతం తడిసి ముద్దవుతుందన్నారు. రైస్ మిల్లర్లు, ఉద్యోగస్తులు ఏకమై రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అలాగే 2017 నుండి ఉద్యోగస్తులకు పిఆర్సి ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ఆర్టీసీనీ వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులను ఉద్యోగస్తులుగా గుర్తించాలన్నారు. ఈ నెల 10 వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ 8 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అనంతరం రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. వడగండ్ల వానతో మెదక్ జిల్లాలో రైతులకు తీరని నష్టం వాటిల్లిందన్నారు. నేటికి నష్టపోయిన పంటల వివరాలను ప్రభుత్వం సేకరించలేదన్నారు. ప్రభుత్వం 15 రోజుల్లో పంట నష్టం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫసల్ భీమా పథకం అమలు చెయ్యకపోవడంతో రైతులకు నష్టం కలుగుతుందన్నారు. వెంటనే ఫసల్ భీమా పథకం అమలు చేయాలన్నారు.

Next Story