- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్వీస్ రోడ్డు నిర్మించాలని కలెక్టర్ కి వినతి : బీజేపీ మండల అధ్యక్షులు కరణం ఆదిత్య
దిశ, సదాశివపేట : సదాశివపేట బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారంపెద్దాపూర్ గ్రామంలో సర్వీస్ రోడ్డును నిర్మించాలని కలెక్టర్, తహశీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా

దిశ, సదాశివపేట : సదాశివపేట బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారంపెద్దాపూర్ గ్రామంలో సర్వీస్ రోడ్డును నిర్మించాలని కలెక్టర్, తహశీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కరణం ఆదిత్య మాట్లాడుతూ 2018 లోనే ఆర్డర్స్ వచ్చినా సమస్య పరిష్కరించకుండా స్థానిక కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులకు కొమ్ము కాస్తూ ఇప్పటి వరకు అధికారులు చర్య తీసుకోలేదు అన్నారు. ఇప్పటికైనా 15 రోజులలో ఈ సమస్య పరిష్కరించాలని.. లేదంటే జాతీయ రహదారి దిగ్బంధం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపూర్ గ్రామస్థులు సత్యనారాయణ గౌడ్, మహేష్ గౌడ్ జిల్లా నాయకులు అంబదాస్, ప్యాలారం జగన్నాథ్ రెడ్డి, జంజీరాల విజయ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శులు నామ హరిష్, ఉక్కిస భరత్ యాదవ్, మండల పార్టీ నాయకులు శ్రీకాంత్, విఠల్, రమేష్, శ్రీకాంత్, కాశీనాథ్, ప్రశాంత్, లక్ష్మణ్, నాగరాజు, సుభాష్ , దుర్గరాజ్, యం.ప్రశాంత్, విష్ణువర్ధన్ రెడ్డి, రాజిరెడ్డి, శ్రీకృష్ణ, నర్సింలు, చంద్రశేఖర్, అరవింద్, రవి, సాకేత్, స్నేహిత్, సాయిచరణ్ , కె అనిల్ పాల్గొన్నారు.






