- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొమరవెల్లి మల్లన్న భక్తులకు తీరనున్న సెల్ ఫోన్ కష్టాలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని హైదరాబాద్‌లోని వారి నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కొమురవెల్లి మండల బీజేపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి, మనోహరాబాద్ రైల్వేలైన్‌లో భాగంగా కొమురవెల్లిలో నిర్మిస్తున్న మల్లన్న హల్ట్ రైల్వేస్టేషన్ పనుల పురోగతిపై వివరించి,స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

దిశ, కొమురవెల్లి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని హైదరాబాద్‌లోని వారి నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కొమురవెల్లి మండల బీజేపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి, మనోహరాబాద్ రైల్వే లైన్‌లో భాగంగా కొమురవెల్లిలో నిర్మిస్తున్న మల్లన్న హల్ట్ రైల్వేస్టేషన్ పనుల పురోగతిపై వివరించి,స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మూడు నెలలపాటు జరిగే జాతర సమయంలో స్థానిక వర్తక వ్యాపార వర్గాలు వివిధ ప్రాంతాల నుండి దర్శనార్థం వస్తున్న భక్తులు మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థ వలన ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను మంత్రికి వివరించారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి కొమురవెల్లిలో మెరుగైన కమ్యూనికేషన్ ఉండేలా ఆపరేటర్లకు ఆదేశాలు జారీచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బూర్గోజు స్వరూప, మండల ప్రధాన కార్యదర్శి ఎక్కల్ దేవి శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఎక్కల్ దేవి మధు,బూర్గోజు నాగరాజు,పాశం భరత్ తదితరులు పాల్గొన్నారు.






