వచ్చే ఎన్నికల్లో BJP అధికారంలోకి రావడం ఖాయం: Former Minister Babu Mohan

by Satheesh |   (  Updated:2022-11-30 15:17:13  IST  )

గ్రామాల్లోని సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కారించేందుకు ప్రజా గోస- బీజేపీ భరోసా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని మాజీ మంత్రి, రాష్ట్ర బీజేపీ నాయకుడు బాబూమోహన్ తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో BJP అధికారంలోకి రావడం ఖాయం: Former Minister Babu Mohan
X

దిశ, రేగోడ్: గ్రామాల్లోని సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కారించేందుకు ప్రజా గోస- బీజేపీ భరోసా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని మాజీ మంత్రి, రాష్ట్ర బీజేపీ నాయకుడు బాబూమోహన్ తెలిపారు. బుధవారం మండలంలోని టి.లింగంపల్లి, సిందోల్, రేగోడ్ గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించి ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికి వదిలేసి.. బీజేపీ ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. మండలంలోని సిందోల్ రోడ్డు అధ్వాన్నంగా తయారైన పట్టించుకున్న పాపాన ఎవ్వరూ పోవడం లేదని విమర్శించారు. ఎన్నో పథకాలు బీజేపీ అమలు చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పనిగట్టుకుని అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సతీష్ గౌడ్, నాయకులు చంద్రశేఖర్ స్వామి, తుల్జారాం, చందు, నర్సింలు, ధన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

READ MORE

రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Next Story