గ‌తంలో కంటే.. ఈసారి 'ప‌ది'లో మెరుగైన ఫ‌లితాలు

by Ratna Kumari |

ప‌దో త‌ర‌గ‌తి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా గత ఏడాది కంటే ఈ సంవ‌త్స‌రం మెరుగైన ఫలితాలు సాధించడం పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు.

గ‌తంలో కంటే.. ఈసారి ప‌దిలో మెరుగైన ఫ‌లితాలు
X

దిశ, సిద్దిపేట అర్బన్ : ప‌దో త‌ర‌గ‌తి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా గత ఏడాది కంటే ఈ సంవ‌త్స‌రం మెరుగైన ఫలితాలు సాధించడం పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు సిద్దిపేట నియోజక వర్గ పరిధిలో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, వారి తల్లి దండ్రులు, ఉపాధ్యాయులతో టెలీకాన్ఫరెన్స్ లో హరీష్ రావు మాట్లాడారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మంచి భవిష్యత్ కు మంచి లక్ష్యాన్ని ఎంచుకోవాలని సూచించారు. చిన్నకోడూరు మండలం 100 శాతం ఫలితాలు సాధించడం పట్ల ఉపాధ్యాయులకు, విద్యార్థుల కు శుభాకాంక్షలు తెలిపారు. నంగునూర్ మండలం 99. 54 శాతం, నారాయణ రావు పేట 99 శాతం, రూరల్ 98 శాతం, అర్బన్ 94 శాతం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. త్వరలో నే అభినందన కార్యక్రమం ఏర్పాటు చేస్తానని తెలిపారు. 10 జీపీఏ సాధించిన విద్యార్థుల కు ఐ ప్యాడ్ గిఫ్ట్ అందజేస్తానని తెలిపారు. అలాగే 100 శాతం ఉత్తిర్ణత సాధించిన పాఠశాలలకు ప్రోత్సాహం సన్మాన కార్యక్రమం నిర్వహిస్తానని తెలిపారు. ఇంటర్ లో కూడా మంచిగా చదువుకోవాలని, మీకు ఎలాంటి సహాయ, సహకారాలు కావాలన్న తన క్యాంప్ కార్యాలయం అందుబాటులో ఉంటుందని హరీశ్ రావు భరోసా ఇచ్చారు.

Next Story