- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధి హమీ కూలీలపై తేనెటీగల దాడి
by Kema Shiva Kumar |
ఉపాధి హమీ కూలీలపై తేనెటీగలు దాడి చేసిన ఘటన కొండపాక మండలం జప్తినాచరాం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

X
దిశ, కొండపాక: ఉపాధి హమీ కూలీలపై తేనెటీగలు దాడి చేసిన ఘటన కొండపాక మండలం జప్తినాచరాం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. జప్తినాచరం గ్రామంలోని బోందకుంట వద్ద రోజు వారి లాగే ఉపాధి హమీ కూలీలు ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో ఆకస్మాత్తుగా కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నబోయిన లింగయ్య , కొంచెం శ్రీకాంత్, మిట్టపల్లి కనుకయ్య స్వల్ప గాయలయ్యాయి. ఇందులో మడోజు తిరుపతి, గుర్రాల పద్మకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కొండపాక 108 సిబ్బంది మెడికల్ టెక్నీషియన్ మహేందర్, పైలట్ రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు ప్రథమ చికిత్స చేసి సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Next Story






