- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : మేనేజర్ రాజేష్ కుమార్
by Ratna Kumari |
దిశ, రేగోడ్ : సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేగోడ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రాజేష్ కుమార్ సూచించారు. కంప్యూటర్ సెక్యూరిటీ డే సందర్భంగా శనివారం ఖాతాదారులకు

X
దిశ, రేగోడ్ : సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేగోడ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రాజేష్ కుమార్ సూచించారు. కంప్యూటర్ సెక్యూరిటీ డే సందర్భంగా శనివారం ఖాతాదారులకు అవగాహాన కల్పించారు. అపరిచితులు ఫోన్ చేసి వ్యక్తిగత విషయాలైన బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఓటీపీ, ఏటీఎం కార్డు వివరాలు ఎవరితో చెప్పకూడదని తెలిపారు. బ్యాంక్ సిబ్బంది ఎప్పుడు కూడా ఫోన్ చేసి ఎవరికి ఈ విషయాలు అడగరని చెప్పారు. స్మార్ట్ ఫోన్ వాట్సాప్ లో అనవసరమైన ఆఫర్ లింక్స్, ఏపీకే ఫైల్స్ లింక్స్ పై క్లిక్ చేయకూడదన్నారు. సైబర్ ఆర్థిక నేరాల్లో గురైనట్లయితే 1930 నెంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది భూమయ్య, ఉదయ్, సాయిలు, సీఎఫ్ఎల్ కౌన్సిలర్లు అజయ్ కుమార్, మహేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.
Next Story






