- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జోగిపేటలో సందడి చేసిన ‘బలగం’ నటి విజయలక్ష్మి
బలగం సినిమాలో మేనత్త (పోచవ్వ) పాత్రను పోషించిన నటి విజయలక్ష్మి జోగిపేటలో సందడి చేశారు. గురువారం పట్టణంలోని సత్యసాయి బాబా దేవాలయాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

దిశ, అందోల్: బలగం సినిమాలో మేనత్త (పోచవ్వ) పాత్రను పోషించిన నటి విజయలక్ష్మి జోగిపేటలో సందడి చేశారు. గురువారం పట్టణంలోని సత్యసాయి బాబా దేవాలయాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమెను సత్యసాయి సేవా సమితి సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. వారితో సినిమాకు సంబంధించిన విషయాలను చర్చించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ బలగం సినిమా రిలీజ్ రోజున పుట్టపర్తిలోని సత్యసాయి సన్నిధిలో ఉన్నానని, బాబాను దర్శించుకున్న వెంటనే ఆదే రోజు సాయంత్రం సినిమా సక్సెస్ అయ్యిందంటూ ఫోన్లు వచ్చాయని ఆమె తెలిపారు. ఇదంతా సత్యసాయి బాబా ఆశీస్సులతో జరిగిందన్నారు. బలగం సినిమాలో అవకాశం రావడం, సినిమా విజయవంతం కావడం సంతోషానిచ్చిందన్నారు.
1993లో సత్య సాయి సేవా సమితి జోగిపేటలో హరికథ కళాకారిణిగా పక్షం రోజుల పాటు హరికథ రూపంలో మహా భారత కథలను వినిపించి సభికులను అలరించానని తెలిపారు. మళ్లీ 30 ఏళ్ల తరువాత జోగిపేటకు వచ్చినట్లుగా విజయలక్ష్మి తన గతాన్ని నెమరు వేసుకున్నారు.






