కేర్ ఆసుపత్రిలో శిశు విక్రయం.. మృతి చెందిందని చెప్పి తల్లికి తెలియకుండా రూ. 1.5 లక్షలకు విక్రయం

by Kodari Anjali |

తల్లికి తెలియకుండా బిడ్డ చనిపోయిందని చెప్పి.. ఆసుపత్రిలో పని చేసే నర్సు 1. 50 లక్షల రూపాయలకు ఇతరులకు విక్రయించింది.

కేర్ ఆసుపత్రిలో శిశు విక్రయం.. మృతి చెందిందని చెప్పి తల్లికి తెలియకుండా రూ. 1.5 లక్షలకు విక్రయం
X

దిశ, మెదక్ ప్రతినిధి: ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన బిడ్డను తల్లికి తెలియకుండానే విక్రయించారు. బిడ్డ కడుపులోనే మృతి చెందినట్లు నమ్మించారు.. బిడ్డ చావలేదు నర్సులు విక్రయించినట్టు తెలియడంతో ఆసుపత్రి యాజమాన్యంను నిలదీసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పసిపాప విక్రయం ఊదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసుల, బాధితుల కథనం మేరకు.. పాపన్న పేట మండలం లక్ష్మీ నగర్ చెందిన నస్రా ఫాతిమా భర్త అస్లాం ఖాన్‌తో మౌలాలిలో ఉంటున్నారు. గత నెల లక్ష్మీ నగర్‌కు డెలివరీ కోసం వచ్చిన నస్రా పాతిమ మెదక్ లోని కేర్ ఆసుపత్రిలో గత నెల 12 న చేరింది. వైద్యం చేసిన వైద్యులు ఆడ బిడ్డకు ప్రసూతి చేశారు.

కొనుగోలు చేసిన వారితో పాటు నర్సులపై కేసు నమోదు..

మెడికల్ చెకప్ పేరిట ఆసుపత్రిలో పని చేస్తున్న నౌసిన్ ఉన్నీస, నిలోఫర్‌లు బిడ్డను తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకురాలేదు. సిద్దిపేటకు చెందిన మహమ్మద్ ఇక్బాల్, అక్తరి బేగంలకు రూ 1.50 వేలకు విక్రయించారు. తీరా ఆసుపత్రికి వచ్చిన నర్సు బ్లీడింగ్ అధికంగా కావడం వల్ల పుట్టిన బిడ్డ మృతి చెందినట్లు చెప్పినట్లు బాధితురాలు తెలిపింది. రెండు రోజుల తర్వాత ఆసుపత్రికి చెందిన సిబ్బంది ద్వారా పుట్టిన బిడ్డ బతికి ఉన్నట్టు తెలుసుకున్న పసి పాప తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకొని యాజమాన్యంను నిదీశారు. అక్కడి నుంచి వెళ్ళి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విక్రయ విషయం వెలుగులోకి వచ్చింది. పురిటిలో పుట్టిన బిడ్డను కొనుగోలు చేసిన వారితో పాటు నర్సులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు పట్టణ సీఐ మహేష్ తెలిపారు.

శిశు విక్రయంపై కలెక్టర్ సీరియస్.. ఆసుపత్రి సీజ్

ఆసుపత్రిలో శిశు విక్రయం జరిగిన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సీరియస్ గా తీసుకున్నట్టు తెలిసింది. పోలీసులు కేవలం నలుగురిపై కేసు నమోదు చేసినట్టు తెలియడంతో వెంటనే జిల్లా వైద్యాధికారితో ఆసుపత్రిని సీజ్ చేయించారు. పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరినట్టు తెలిసింది.

యాజమాన్యాన్ని తప్పించే ప్రయత్నం..?

పుట్టలో బిడ్డను మయం చేసి విక్రయించిన వైనంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డెలివరీకి వచ్చిన మహిళకు ఆడ బిడ్డ పుట్టినట్లు సమాచారం ఇవ్వకుండా ఎలా విక్రయం జరిపారు అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నర్సు, కొనుగోలు చేసిన వారిపైనే పోలీసులు కేసు నమోదు చేయడం యాజమాన్యంపై ఎలాంటి చర్యలు లేకపోవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఆసుపత్రి యాజమాన్యంకు తెలియకుండా శిశు విక్రయం ఎలా జరిగిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో కూడా ఇలాంటివి జరిగి ఉండవచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. శిశు విక్రయంపై పక్కగా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Next Story