- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురి అరెస్ట్
by Kema Shiva Kumar |
పేకాట స్థావరంపై దాడి చేసి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఘటన రాజక్కపేట నుంచి మల్లన్న గుట్టకు వెళ్లే శివారులో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది.

X
దిశ, దుబ్బాక: పేకాట స్థావరంపై దాడి చేసి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఘటన రాజక్కపేట నుంచి మల్లన్న గుట్టకు వెళ్లే శివారులో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్సై బత్తుల మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండలానికి చెందిన ఏడుగురు వ్యక్తులు రాజక్కపేట నుంచి మల్లన్న గుట్టకు వెళ్లే దారిలో ఉన్న అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి ఐదుగురి అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. పట్టుబడిన వ్యక్తుల నుంచి రూ.13 వేలు, ఐదు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Next Story






