- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీసీసీ డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ వీరన్న నియామకం
దిశ, ఆందోల్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ పీసీసీ) డాక్టర్స్ సెల్, మెడికల్ & హెల్త్ విభాగం వైస్-చైర్మన్‌గా జోగిపేట కు చెందిన డాక్టర్ అద్దంకి వీరన్నను నియమిస్తూ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఎం. రాజీవ్

దిశ, ఆందోల్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ పీసీసీ) డాక్టర్స్ సెల్, మెడికల్ & హెల్త్ విభాగం వైస్-చైర్మన్‌గా జోగిపేట కు చెందిన డాక్టర్ అద్దంకి వీరన్నను నియమిస్తూ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఎం. రాజీవ్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే అమలులోకి వచ్చే విధంగా ఈ నియామకాన్ని ప్రకటించారు. పార్టీ బలోపేతం కోసం నిరంతరం శ్రమించాలని, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ నాయకత్వాన్ని మరింతగా నిలబెట్టాలని ఈ సందర్భంగా డా. రాజీవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలపర్చడంలో డా. వీరన్న మరింతగా సేవలు అందిస్తారని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర పీసీసీ వైద్య విభాగం వైస్ చైర్మన్ గా నియమించ డానికి సహకరించిన సీఎం రేవెంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రేస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ , రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి దామోదర్ రాజనరసింహా, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ డాక్టర్ సెల్ మెడికల్ హెల్త్ ఛైర్మెన్ డాక్టర్ రాజీవ్ లకు డాక్టర్ వీరన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.






