తాత్కాలిక డ్రైవర్లకు, కండక్టర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం....

by Taduka Kalyani |

టీజీఎస్ ఆర్టీసీ సంస్థలో ఉద్యోగులు ప్రస్తుతం సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేపట్టబడుతున్నామని మెదక్ ఆర్టీసీ డీఎం సురేఖ ఒక ప్రకటన విడుదల చేశారు.

తాత్కాలిక డ్రైవర్లకు, కండక్టర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం....
X

దిశ, మెదక్ టౌన్ : టీజీఎస్ ఆర్టీసీ సంస్థలో ఉద్యోగులు ప్రస్తుతం సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేపట్టబడుతున్నామని మెదక్ ఆర్టీసీ డీఎం సురేఖ ఒక ప్రకటన విడుదల చేశారు. మెదక్ డిపోలో తాత్కాలిక డ్రైవర్లుగా నియమించుకోవడానికి 18 నెలల హెవీ లైసెన్స్, అనుభవం ఉన్న వారు ఉదయం 5 గంటలకి మెదక్ డిపోలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. టిజిఎస్ ఆర్టీసీ సేవలను కొనసాగించేందుకు పదో తరగతి ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులను నర్సాపూర్ డిపోలో తాత్కాలికంగా కండక్టర్లు గా నియమించడానికి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయని నర్సాపూర్ లో తాత్కాలిక కండక్టర్ పోస్టులకు ఆసక్తి గల అభ్యర్థులు క్రింది అర్హతలు కలిగి ఉండాలని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి, ఆధార్ కార్డు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అభ్యర్థులు తమ బయోడేటా విద్యార్హత సర్టిఫికెట్ లో ఉదయం 5 గంటలకు నర్సాపూర్ డిపో కార్యాలయం వద్ద సంప్రదించాలని తెలిపారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలందించడం టీజీఎస్ ఆర్టీసీ ముఖ్య లక్ష్యం అని ఆమె పేర్కొన్నారు.

Next Story