గ్రామంలో ఏ స‌మ‌స్య ఉన్నా స‌ర్పంచ్ దృష్టికి తీసుకురావాలి : ఎంపీడీవో ల‌క్ష్మ‌ప్ప

by Ratna Kumari |

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం రసులబాద్ గ్రామంలో సర్పంచ్ పచ్చిమడ్ల అనుష స్వామిగౌడ్ ఆధ్వర్యంలో శనివారం గ్రామసభ నిర్వహించారు.

గ్రామంలో ఏ స‌మ‌స్య ఉన్నా స‌ర్పంచ్ దృష్టికి తీసుకురావాలి : ఎంపీడీవో ల‌క్ష్మ‌ప్ప
X

దిశ, కొమురవెల్లి : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం రసులబాద్ గ్రామంలో సర్పంచ్ పచ్చిమడ్ల అనుష స్వామిగౌడ్ ఆధ్వర్యంలో శనివారం గ్రామసభ నిర్వహించారు. ఈ సభ‌లో పలు అభివృద్ధి పనులకు తీర్మాణాలు ప్రవేశపెట్టారు. ముఖ్యఅతిథిగా ఎంపీడీవో లక్ష్మప్ప హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామంలో ఏ సమస్య ఉన్నా సర్పంచ్, సెక్రటరీ దృష్టికి తీసుకురావాలని కోరారు. గ్రామపంచాయతీకి వచ్చే నిధులను పంచాయతీ నోటిస్ బోర్డులో పెట్టాలని సూచించారు. గ్రామంలో ఉపాధిహామీ పనులు పూర్తి స్థాయిలో జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎర్రోళ్ల సుదర్శన్, పంచాయతీ సెక్రటరీ బాలనర్సయ్య, ఏఎస్ఐ సత్యనారాయణ రెడ్డి, ఏఈఓ రవళి, వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story