సిద్దిపేట జిల్లాలో మరో పరువు హత్య

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, వ‌ర్గ‌ల్ : సాధార‌ణంగా త‌ల్లికి త‌న కొడుకు బంగారు భ‌విష్య‌త్. ఆ ఇంటికి అత‌డు ఓ వెలుగు. కానీ క్ష‌ణిక ఆవేశంలో తీసుకున్న ఓ తీవ్ర నిర్ణ‌యం ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గుండెల

సిద్దిపేట జిల్లాలో మరో పరువు హత్య
X

దిశ‌, వ‌ర్గ‌ల్ : సాధార‌ణంగా త‌ల్లికి త‌న కొడుకు బంగారు భ‌విష్య‌త్. ఆ ఇంటికి అత‌డు ఓ వెలుగు. కానీ క్ష‌ణిక ఆవేశంలో తీసుకున్న ఓ తీవ్ర నిర్ణ‌యం ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గుండెల నిండా ప్రేమ‌ను పంచుకోవాల‌నుకున్న ఆ యువ‌కుడి ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి. కేవ‌లం ప్రేమ విఫలం అయింద‌నే చిన్న కార‌ణంతో లోకంలో ఏదీ శాశ్వ‌తం కాద‌నే నిజాన్ని మ‌రిచిపోయి ఆ యువ‌కుడు తీసుకున్న అనాలోచిత నిర్ణ‌యం.. క‌న్న‌త‌ల్లికి కోలుకోలేని బాధ‌ను మిగిల్చింది. కుటుంబం ఆశ‌ల‌న్నీ ఆ యువ‌కుడిపైనే పెట్టుకోగా.. ఇలా అర్థాంత‌రంగా త‌నువు చాలించ‌డం ఆ గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకునేలా చేసింది. ఈ ఘ‌ట‌న పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అంబర్ పేటకు చెందిన దళిత యువకుడు గంగిళ్ళ పవన్ కళ్యాణ్ (21) ను పరువు హత్య చెసిన మల్లారెడ్డి పల్లికి చెందిన యాదవ నిందితుల పై హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు.


మంగళవారం రోజున మృతుడి తల్లిదండ్రులను,పొలీసులను గాంధీ ఆసుపత్రిలో కలిసి యువకుడి మరణానికి కారణాలను తెలుసుకొని తల్లిదండ్రులకు మనో దైర్యం కల్పించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ మల్లారెడ్డి పల్లికి చెంది యాదవ కులానికి చెందిన అమ్మాయి గత సంవత్సరం కాలంగా ప్రేమించుకొని వేములవాడ లో వివాహం చెసుకున్నారు. అప్పుడు ఇద్దరు మైనర్ లు కావడంతో పోలీసుల కౌన్సిలింగ్ ఇచ్చి మెజర్లు అయిన తర్వాత వివాహం చెస్తామని చెప్పడంతో విడిగా వుంటున్నారు. ఇటివల అమ్మాయికి మరో పెండ్లి చేసేందుకు తల్లితండ్రులు ప్రయత్నం చెస్తుండగా ఈ నెల 19 న అమ్మాయి ఫోన్ చేసి నాకు పెండ్లి సంబంధాలు చూస్తున్నారని పారిపోదాం లేదా అత్మహత్య చేసుకుందామని అబ్బాయిని మల్లారెడ్డి పల్లి ఇంటి కి పిలపించడాన్ని గమనించిన అమ్మాయి తండ్రి, అన్న తదితరులు పవన్ ను దారుణంగా కొట్డారు. మందు తాగిపించారో తాగడానే కొణం లో సమగ్ర విచారణ చేసి నిందితుల పై హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు .అంబర్ పేట గ్రామాన్ని జిల్లా కలెక్డర్ ,పొలీస్ కమిషనర్ సందర్శించాలని వారు కోరారు.

Next Story