- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
by Kema Shiva Kumar |
తీవ్ర గాయాలతో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన చేర్యాల మండలం కడవేర్గు గ్రామ శివారులో కలకలం రేపింది.

X
దిశ, చేర్యాల: తీవ్ర గాయాలతో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన చేర్యాల మండలం కడవేర్గు గ్రామ శివారులో కలకలం రేపింది. చేర్యాల ఎస్సై ఉరడి భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కడవేర్గు శివారులో తీవ్ర గాయాలతో పడి ఉన్న గుర్తుతెలియని పురుషుడి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి పోలీసులు వెళ్లి పరిసరాలను పరిశీలించగా అక్కడే కొంతదూరంలో దుస్తులను గుర్తించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే.. సమీప పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని ఎస్సై భాస్కర్ రెడ్డి సూచించారు.
Next Story






