అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెమిస్టర్ పరీక్షల ఫీజు ఈనెల 19 లోపు చెల్లించాలి

by Kodari Anjali |

ఈ నెల 19 లోపు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెమిస్టర్ పరీక్షల ఫీజు తేదీ లాస్ట్ అని, విద్యార్థులంతా ఫీజు చెల్లించండని సహాయక కేంద్రం రీజనల్ కోఆర్డినేటర్ తెలిపారు.

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెమిస్టర్ పరీక్షల ఫీజు ఈనెల 19 లోపు చెల్లించాలి
X

దిశ, సిద్దిపేట అర్బన్: డా.బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2025-26 విద్య సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రథమ సంవత్సరం సెకండ్ సెమిస్టర్, ద్వితీయ సంవత్సరం నాలుగవ సెమిస్టర్, మూడవ సంవత్సరం ఆరవ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు పరీక్షల నోటిఫికేషన్ వెలువడినట్లు సహాయక కేంద్రం రీజనల్ కోఆర్డినేటర్ డా. యం శ్రద్దానందం ప్రకటనలో పేర్కొన్నారు. ఒక సబ్జెక్ట్ కు రూ.150 చొప్పున ఈ నెల 19 వ తేదీ లోపు మీ సేవ కేంద్రాల్లో చెల్లించాలని సూచించారు. సైన్స్, కంప్యూటర్ సబ్జెక్టు చదివే విద్యార్థులు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుందన్నారు. అపరాధ రుసుము రూ.500 లతో ఈనెల 23 వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించే వీలు ఉందన్నారు. ఆరవ సెమిస్టర్ పరీక్షలు జూన్ 14 నుంచి 19వ తేదీ వరకు, 4వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 21 నుంచి 28వ తేదీ వరకు, సెకండ్ సెమిస్టర్ పరీక్షలు ఈ జూన్ 30 నుంచి జూలై 6వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో నిర్వహించడం జరుగుతుందని సహాయక కేంద్రం రీజనల్ కోఆర్డినేటర్ డా. యం శ్రద్దానందం తెలిపారు.

Next Story