- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబరాన్నంటిన..హోలీ సంబరాలు
హోలీ పండగ పురస్కరించుకొని జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా కేంద్రంతో పాటుగా, ఊరూరా రంగుల పండగను చిన్నా పెద్ద కలిసి ఆడి పాడుతూ.. రంగులు చల్లుకుంటూ కేరింతలతో ఉత్సాహంగా జరుపుకున్నారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి:
హోలీ పండగ పురస్కరించుకొని జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా కేంద్రంతో పాటుగా, ఊరూరా రంగుల పండగను చిన్నా పెద్ద కలిసి ఆడి పాడుతూ.. రంగులు చల్లుకుంటూ కేరింతలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. సిద్దిపేట పట్టణంలోని లాల్ కమాన్ వద్ద మార్వాడీలు రంగుల పండగను ఆనంద ఉత్సాహాల మద్య జరుపుకున్నారు. సంప్రదాయ పాటలు పాడతూ..హోలీ ఆడారు. యువకులు డప్పు చప్పుళ్లు లతో సహజ సిద్దమైన రంగులు పూసుకుంటూ హోలీ జరుపుకున్నారు. సిద్దిపేట పట్టణ 39వ వార్డులో స్థానిక కౌన్సిలర్ దీప్తి నాగరాజు ఆధ్వర్యంలో చేపట్టిన ఈకో ఫ్రెండ్లి - రంగోస్తవం కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బైరా శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో నియోజక వర్గ ఇన్ చార్జి పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో.. హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదే విధంగా టీపీసీసీ మెంబర్ దరిపల్లి చంద్రం మార్కెట్ యార్డ్ లో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు జల్లుకొని హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపారు.
- Tags
- holi festival






